Crime News: పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్‌, బస్సు ఢీ : ఎనిమిది మంది దుర్మరణం

  • మృతుల్లో ఏడుగురు విద్యార్థులు, వ్యాన్‌ డ్రైవర్‌ : 12 మందికి గాయాలు
  • మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం
  • సత్నా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌ జిల్లాలో ఘటన
పాఠశాల విద్యార్థులను తీసుకు వెళ్తున్న వ్యాన్‌, బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా మరో పన్నెండు మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు విద్యార్థులుండగా, వ్యాన్‌ డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సత్నా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. బిర్సింగ్‌పూర్‌ ప్రాంతంలోని రీవా-చిత్రకూట్‌ రోడ్డులో విద్యార్థులతో వ్యాన్‌ వెళ్తోంది. ఎదురుగా అతివేగంగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో వ్యాన్‌ అదుపు తప్పడంతో ఈ ఘోరం జరిగింది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే  ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Crime News
bus-van hit
Madhya Pradesh

More Telugu News