chiranjeevi: దర్శకత్వం పట్ల ఆసక్తి చూపుతోన్న మెగాస్టార్

  • దర్శకత్వంపై చిరూకి పూర్తి అవగాహన
  • ముచ్చట తీర్చుకున్న సందర్భాలు 
  • మెగాఫోన్ పెట్టాలనే ఆసక్తి
సినిమాను ఒక తపస్సులా భావించి కష్టపడే కథానాయకులలో చిరంజీవి ముందువరుసలో కనిపిస్తారు. మొదటి నుంచి కూడా ఆయన తన సీన్ పూర్తికాగానే అక్కడి నుంచి వెళ్లిపోవడం చేసేవారు కాదు. కెమెరా వెనక్కి వెళ్లి మిగతా సన్నివేశాలను దర్శకుడు ఎలా చిత్రీకరిస్తున్నాడో చూస్తుంటారు. ఒక్కోసారి దర్శకుడు సెట్స్ కి రావడం ఆలస్యమైతే ఒకటి రెండు సీన్స్ ను ఆయన చిత్రీకరించిన సందర్భాలు వున్నాయి.

ఇటీవల 'సైరా' సినిమా కోసం ఆయనొక సీన్ ను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ .. కమల్ .. అర్జున్ హీరోలుగానే కాకుండా దర్శకులుగా కూడా సక్సెస్ అయ్యారు. అలా తాను కూడా పూర్తిస్థాయి దర్శకుడిగా ఒక సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో చిరంజీవి వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవికి దర్శకత్వంపై గల ఆసక్తిని చూసినవాళ్లు ఆయన మెగా ఫోన్ పట్టుకోవడం ఖాయం .. కాకపోతే అందుకు కొంత సమయం పట్టొచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.      
chiranjeevi

More Telugu News