bhikshapathi yadav: భిక్షపతి యాదవ్ ను కలిసిన భవ్య ఆనందప్రసాద్

  • శేరిలింగంపల్లి నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఆనందప్రసాద్
  • రెబెల్ గా నామినేషన్ వేసిన భిక్షపతి యాదవ్
  • తన గెలుపుకు సహకరించాలని కోరిన ఆనందప్రసాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ కు ఆటంకాలు తొలగిపోయాయి. మహాకూటమిలో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో... కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ రెబెల్ గా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పెద్దలు ఆయనను కలసి బుజ్జగించారు. దీంతో, పోటీ నుంచి తప్పుకునేందుకు ఆయన అంగీకరించారు.

మరోవైపు, ఈ ఉదయం భిక్షపతి యాదవ్ ఇంటికి భవ్య ఆనందప్రసాద్ వెళ్లారు. ఆయకు పుష్పగుచ్ఛం అందించి... ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని కోరారు. తన గెలుపుకు సహకరించాలని అభ్యర్థించారు. ఆనందప్రసాద్ విన్నపం పట్ల భిక్షపతి సానుకూలంగా స్పందించారు.
bhikshapathi yadav
bhavya anand prasad
Telugudesam
congress
serilingampalli

More Telugu News