kodada: కేటీఆర్ తో భేటీ అయిన టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి శశిధర్ రెడ్డి

  • టికెట్ ఆశించి భంగపడ్డ శశిధర్ రెడ్డి
  • కోదాడ నుంచి రెబెల్ గా నామినేషన్
  • కేటీఆర్ బుజ్జగింపులతో నామినేషన్ ఉపసంహరణకు సిద్ధమైన నేత
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన టీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి పార్టీ టికెట్ ను ఆశించి భంగపడ్డారు. తనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈరోజు నామినేషన్ల ఉపసంహరణకు తుది రోజు కావడంతో... ఆయనను మంత్రి కేటీఆర్ తన వద్దకు పిలిపించుకున్నారు.

హైదరాబాదులో కేటీఆర్ తో శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని, పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ పదవి కానీ, ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కానీ ఇస్తామని శశిధర్ కు కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో, నామినేషన్ ను ఉపసంహరించుకుని, టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సహకరించేందుకు ఆయన సిద్ధమయ్యారని తెలుస్తోంది.
kodada
TRS
sasidhar reddy
KTR
rebel
nomination

More Telugu News