Pawan Kalyan: రాజకీయ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కొత్త చిత్రం... డాలీ దర్శకత్వంలో మల్టీ స్టారర్?
- ఇప్పట్లో టాలీవుడ్ రిటైర్ మెంట్ లేనట్టే
- ప్రజలు మెచ్చే మాస్ లీడర్ గా కనిపించనున్న పవన్
- ఇటీవలే సినిమాలకు దూరమని చెప్పిన పవన్
- డాలీ తెచ్చిన స్క్రిప్ట్ విని మనసు పడ్డారంటున్న టాలీవుడ్
జనసేన అధినేత, ఏపీ రాజకీయాల్లో తనదైన స్థానం పొందేందుకు శ్రమిస్తున్న పవన్ కల్యాణ్, టాలీవుడ్ 'రిటైర్ మెంట్' ఇప్పట్లో జరగబోదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పొలిటికల్ కెరీర్ పై దృష్టిని పెడతానని, సినిమాలకు దూరమని ఆయన చెప్పినప్పటికీ, తన వద్దకు వచ్చిన ఓ స్క్రిప్ట్ పై ఆయన మనసు పడ్డారని సమాచారం. పవన్ కల్యాణ్ కు మంచి స్నేహితుడు, 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' చిత్రాల దర్శకుడు డాలీ అలియాస్ కిషోర్ పార్దసానితో ఓ రాజకీయ నేపథ్యమున్న చిత్రాన్ని ఆయన చేసేందుకు అవకాశం వుందని తెలుస్తోంది.
సమకాలీన రాజకీయాలను ప్రతిబింబిస్తూ, రాజకీయ వేడిని పెంచేలా ఈ సినిమా ఉంటుందని, ఇందులో పవన్ ప్రజలు మెచ్చే మాస్ లీడర్ గా 45 నిమిషాల పాటు కనిపిస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో మరో యువ హీరోకు ఇందులో ప్రధాన పాత్ర ఉంటుందని, ఓ మల్టీ స్టారర్ గా చిత్రాన్ని మలచేందుకు టాప్ యంగ్ హీరోను డాలీ సంప్రదించారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.