brisbane: బ్రిస్సేన్ టీ20.. టీమిండియా ఓటమి

  • వర్షం కారణంగా మ్యాచ్ 17 ఓవర్లకు కుదింపు
  • ఆసీస్ జట్టు నిర్దేశించిన 174 పరుగుల విజయ లక్ష్యం  
  • నాలుగు పరుగుల తేడాతో భారత్ ఓటమి
బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 174 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదించారు. డక్ వర్త్ లూయిస్ (డీఎల్ఎస్)  ప్రకారం టీమిండియాకు 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విజయలక్ష్యాన్ని ఛేదించలేకపోయిన టీమిండియా తొలి టీ20ను కోల్పోవాల్సి రావడం అభిమానులకు నిరాశ కలిగించింది.
brisbane
teamindia
Australia
1 t20

More Telugu News