TRS: టీఆర్ఎస్ ను వీడుతున్న మరో ముగ్గురు ఎంపీలు వీరేనంటూ ప్రచారం!

  • ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు షాక్
  • ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పిన కొండా
  • జాబితాలో జితేందర్, పటేల్, పొంగులేటి ఉన్నారంటూ ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో... టీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొండా... ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో, మరో ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్ ను వీడనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కారు దిగి, కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఐదు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. తాను పార్టీ మారబోవడం లేదని మీడియా ముఖంగా కొండా చెప్పినప్పటికీ... చివరకు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో, కొండా దారిలోనే మరో ముగ్గురు ఎంపీలు కూడా టీఆర్ఎస్ ను వీడటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.  
TRS
quit
jitender reddy
bb patel
ponguleti srinivas reddy
konda visweshwar reddy
congress

More Telugu News