Andhra Pradesh: మోదీ ఓడిపోతే జైలుకు పోతానని జగన్ కు భయం పట్టుకుంది!: మంత్రి యనమల

  • బీజేపీయేతర పక్షాలను బాబు ఏకం చేస్తున్నారు
  • మోదీపై విమర్శలను జగన్ తట్టుకోలేకపోతున్నారు
  • అమరావతిలో మీడియా సమావేశంలో మంత్రి వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేశంలోని బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తుంటే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తట్టుకోలేకపోతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బీజేపీపై తెలుగుదేశం పోరాడుతుంటే ఆయనకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ చేసిన విమర్శలను యనమల ఖండించారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మోదీ ఓడిపోతే జైలుకు పోతానని జగన్ కు భయం పట్టుకుందని యనమల ఆరోపించారు. అందుకే ఆయన కోడికత్తి నాటకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరోసారి టీడీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని వ్యాఖ్యానించారు. అందువల్లే ఇప్పుడు సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
Andhra Pradesh
Yanamala
Jagan
Narendra Modi
chandrababu

More Telugu News