punjab: పంజాబ్‌లో ఆప్‌నేత సురేష్‌శర్మపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు

  • సురేష్‌కి చెందిన ఫర్నీచర్‌ దుకాణానికి వచ్చి కాల్చిన దుండగులు
  • ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌పై దాడి జరిగిన కొద్ది గంటలకే ఈ ఘటన
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
పంజాబ్‌ రాష్ట్రంలోని అమృతసర్‌ యూనిట్‌కి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత సురేష్‌ శర్మపై మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సురేష్‌ నిర్వహణలో ఉన్న ఫర్నీచర్‌ షాపునకు వచ్చిన దుండగులు ఆయనను అతి దగ్గర నుంచి మూడు రౌండ్లు కాల్చి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శర్మను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మంగళవారం మధ్యాహ్నం ఏకంగా సచివాలయంలో దాడి జరిగి కొన్ని గంటలు గడవక ముందే ఈ ఘటన జరగడం సంచలనం రేకెత్తించింది. దాడిని ఆప్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. సురేష్‌ శర్మ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పోలీసులు దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
punjab
Arvind Kejriwal
New Delhi

More Telugu News