కాపీ కొట్టడంలో చంద్రబాబును మించినోళ్లు లేరు.. అయినా ఆ ప్రతిభను ఎవ్వరూ గుర్తించడం లేదు!: విజయసాయిరెడ్డి
- ఏ ఐడియా కూడా చంద్రబాబు సొంతం కాదు
- ఏపీ అప్పులకు బాబు, అనుచరులే కారణం
- వారి ఆస్తులతో ఏపీ అప్పులు తీర్చేయవచ్చు
చంద్రబాబు, ఆయన పచ్చ గ్యాంగు దోపిడీ కారణంగానే ఆంధ్రప్రదేశ్ అప్పులు అమాంతం పెరిగిపోయాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులను స్వాధీనం చేసుకుంటే ఏపీ కచ్చితంగా అప్పుల నుంచి బయటపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ పరిభాషలో చెప్పాలంటే చంద్రబాబు పక్కా కాపీ క్యాట్ అనీ, ఆయనో కాపీ-పేస్ట్ మ్యాన్ అని వ్యాఖ్యానించారు.