Madhya Pradesh: మద్యం మత్తులో సిగరెట్ అంటించుకున్న మహిళ... సజీవదహనమైంది!

  • దుప్పటికి అంటుకున్న సిగరెట్ నిప్పు
  • మత్తులోనే కాలి బూడిదైన కల్పన
  • కేసు విచారిస్తున్న పోలీసులు
పూటుగా మద్యం తాగిన ఓ మహిళ, మత్తులో ఈ-సిగరెట్ ను వెలిగించుకుని, అలాగే నిద్రపోగా, దుప్పటికి మంటలంటుకుని ఆమె సజీవ దహనమైంది. ఈ ఘటన ఇండోర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడ పరమ్ విహార్ లో కల్పనపతి ప్రేమ్ థాపా అనే మహిళ, భర్తకు దూరంగా ఉంటూ, ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కృష్ణపాల్ సింగ్ తో సహజీవనం చేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.

ప్రొఫెసర్ ఇంట్లో లేని సమయంలో మందుకొట్టిన ఆమె, సిగరెట్ అంటించుకుని నిద్రపోయింది. ఆ నిప్పు తొలుత దుప్పటికి, ఆపై మంచానికి అంటుకుంది. మద్యం మత్తులో పడివున్న ఆమెకు మంటలంటుకున్న విషయం కూడా తెలియలేదు. కల్పన నిద్రిస్తున్న గదిలో నుంచి పొగలు వస్తుండటంతో, గమనించిన ఇంటి యజమాని, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికే ఆమె సజీవ దహనమై కనిపించింది. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించారు.
Madhya Pradesh
Indore
Police
E-Cigar
Fire Accident

More Telugu News