New Delhi: న్యూఢిల్లీలోకి చొరబడిన ఇద్దరు టెర్రరిస్టులు... ఫోటో విడుదల చేసిన పోలీసులు!

  • ఆనవాళ్లు కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేయండి
  • నల్లటి కుర్తాలతో ఉన్న యువకుల చిత్రం విడుదల
  • హెచ్చరించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు
ఇద్దరు ఉగ్రవాదులు న్యూఢిల్లీలోకి ప్రవేశించారని, వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని చెబుతూ ఇద్దరి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరితో జాగ్రత్తగా ఉండాలని, ఈ ఆనవాళ్లతో ఎవరైనా తారసపడితే, 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేసి చెప్పాలని పోలీసులు కోరారు.

కాగా, ఈ ఫోటోలో ఢిల్లీకి 360 కిలోమీటర్లు, ఫిరోజ్ పూర్ కు 9 కిలోమీటర్ల దూరం ఉన్న ఓ మైలురాయి వద్ద ఇద్దరు నల్లటి కుర్తాలు ధరించిన యువకులు ఉన్నారు. ఫిరోజ్ పూర్ పట్టణం పంజాబ్ లోని ఇండియా - పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు. కాగా, గత వారంలో జైషే మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీ దిశగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
New Delhi
Terrorists
Counter Intelegence
Photos

More Telugu News