కేసీఆర్ విమర్శలపై తొలిసారి స్పందించిన చంద్రబాబు.. వాస్తవాలు వివరించేందుకు స్టేటస్ నోట్ తయారుచేయాలంటూ అధికారులకు ఆదేశం
- సాగునీటి ప్రాజెక్టులను ఏపీ అడ్డుకుంటోందంటూ టీఆర్ఎస్ ప్రచారం
- తెలుగు ప్రజలకు వాస్తవాలు వివరిద్దామన్న చంద్రబాబు
- స్టేటస్ నోట్‌ను తయారుచేయాలంటూ జలవనరుల శాఖకు ఆదేశం
తనను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుండడంపై చంద్రబాబు తొలిసారి స్పందించారు. మంగళవారం రాత్రి జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో ఉండవల్లిలోని ప్రజావేదిక దర్బారులో సీఎం సమావేశమయ్యారు. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం విధానమేంటో రెండు రాష్ట్రాల ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన స్టేటస్ నోట్‌ను తయారుచేయాల్సిందిగా ఆదేశించారు. కేంద్రానికి రాసిన లేఖల్లోని అంశాలను ప్రజలకు వివరించి, వాస్తవాలు తెలియజెప్పేలా స్టేటస్ నోట్‌ను తయారుచేయాలని సూచించారు.