Pawan Kalyan: మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన పవన్ కల్యాణ్!

  • పవన్ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు
  • ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు
  • పూర్తి సమయం ప్రజా జీవితానికే అని ప్రకటన
ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో పవన్ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలపై పవన్ తాజాగా ఓ ప్రకటనలో స్పందించారు. 'నేను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు. సినిమాలో నటించేందుకు అవసరమైన సమయం లేదు. ప్రజా జీవితానికే పూర్తి సమయం కేటాయించాను. ప్రజల్లోనే ఉంటూ, జన సైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనలు అన్నీ ప్రజాక్షేమం కోసమే, నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే' అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
Pawan Kalyan
Jana Sena
Tollywood

More Telugu News