vijayasaireddy: మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ధ్వజం

  • కన్సల్టెంట్లకు కోట్లు ధార పోశాడు
  • రాజమండ్రి రైల్‌ బ్రిడ్జిని టూరిస్టు అట్రాక్షన్‌ చేస్తానన్నాడు
  • ట్విట్టర్లో చంద్రబాబుపై ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి 
వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. '10 వేల కోట్లతో టూరిజం మిషన్‌, హెలీ టూరిజం, బీచ్‌ టూరిజం అంటూ చంద్రబాబు నాయుడు ఊదరగొట్టేశాడు. ఐఎన్ఎస్ విరాట్‌ను కన్వెన్షన్‌ సెంటర్‌గా మారుస్తానని కన్సల్టెంట్లకు కోట్లు ధార పోశాడు. రాజమండ్రి రైల్‌ బ్రిడ్జిని టూరిస్టు అట్రాక్షన్‌ చేస్తానన్నాడు. మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు' అంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
vijayasaireddy
Chandrababu
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News