sushmaswaraj: ఎన్నికలలో పోటీ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్న సుష్మా స్వరాజ్!

  • రానున్న ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయం 
  • ఆరోగ్య పరమైన కారణాల వలన పోటీకి దూరం అని ప్రకటన 
  • ప్రస్తుతం విదిషా నుండి ప్రాతినిధ్యం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఈరోజు ఓ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలా.. వద్దా.. అనేది మామూలుగా పార్టీ నిర్ణయిస్తుందని, కానీ, ఆరోగ్య పరమైన కారణాల వలన పోటీ చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ప్రస్తుతం సుష్మా విదిషా లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
sushmaswaraj
loksabha
elections
BJP

More Telugu News