Congress: ‘కాంగ్రెస్’ను వీడిన ముత్యంరెడ్డి.. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి!

  • కాంగ్రెస్ టికెట్ దక్కని ముత్యంరెడ్డి 
  • టీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్
  • ముత్యంరెడ్డికి పార్టీ కండువా కప్పి అభినందనలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. సిద్దిపేటలో ఈరోజు నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సభా వేదికపైనే ముత్యంరెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా  ఆహ్వానించారు. కాగా, తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకు లభించకపోవడంపై ముత్యంరెడ్డి తీవ్ర అసంతప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తొగుటలోని ముత్యంరెడ్డి నివాసానికి హరీశ్ రావు ఇటీవల వెళ్లారు. టీఆర్ఎస్ లో చేరాలని ఆయన్ని ఆహ్వానించారు.
Congress
kcr
TRS
dubbaka

More Telugu News