Samsung Galaxy A9 (2018): అద్భుత ఫీచర్లు.. నాలుగు కెమెరాలతో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించిన శాంసంగ్!

షార్ట్స్‌లో చూడండి
సౌత్ కొరియా కంపెనీ శాంసంగ్ మొట్టమొదటి సారి నాలుగు కెమెరాలతో నూతన స్మార్ట్ ఫోన్ ని ఆవిష్కరించింది. గతంలో ట్రిపుల్ కెమెరాలతో 'గెలాక్సీ ఏ7' ని విడుదల చేసి ఆశ్చర్యపరచిన శాంసంగ్ సంస్థ తాజాగా నాలుగు కెమెరాలతో 'గెలాక్సీ ఏ9 (2018)'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే నాలుగు కెమెరాలతో వచ్చిన తొలి ఫోన్ ఇదేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డెప్త్/టెలీఫోటో సెన్సార్, పేస్ రికగ్నిషన్, క్విక్ ఛార్జ్ లాంటి టెక్నాలజీ ఫీచర్లు మరెన్నో దీనిలో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.36,990 ఉండగా, 8 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.39,990గా నిర్ణయించారు. కేవియల్ బ్లాక్, లేమనెడ్ బ్లూ, బబుల్ గమ్ పింక్ కలర్లలో లభించే ఈ ఫోన్ ఈనెల 28 నుండి విక్రయానికి అందుబాటులోకి రానుంది.

గెలాక్సీ ఏ9 (2018) ప్రత్యేకతలు:

  • వెనక భాగంలో 24/10/8/5 మెగాపిక్సెల్ కెమెరాలు
  • 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 6.3" ఫుల్ హెచ్ డీ ప్లస్ (1080x2220 పిక్సల్స్)
  • ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్
  • 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • క్వాల్ కామ్ స్నాప్‌ డ్రాగన్ 660 ప్రాసెసర్
  • 3800 ఎంఏహెచ్ బ్యాటరీ
Go Back to Shorts
Samsung Galaxy A9 (2018)
samsung
smartphone
southkorea
India
Tech-News
technology
Quad Rear Camera

More Telugu News