bcci: ధోని స్థానంలో యువ ఆటగాడు.. ఆస్ట్రేలియాతో తొలి టీ-20కి జట్టుని ప్రకటించిన బీసీసీఐ!

  • రేపు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ-20
  • రిషబ్ పంత్‌ కి  వికెట్ కీపర్‌ గా బాధ్యతలు
  • ప్రకటించిన బీసీసీఐ
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు తొలి టీ-20 జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో రేపు ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ-20కి 12మంది సభ్యులతో కూడిన జట్టుని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఎంఎస్ ధోని స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్‌ కి వికెట్ కీపర్‌ గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహల్..
bcci
Cricket
INDvAUS
Australia
India

More Telugu News