Mumbai: ధోనీ భార్య సాక్షి జన్మదిన వేడుకల్లో సిగరెట్ తో కనిపించిన పాండ్యా... వీడియో!

  • ముంబైలో పుట్టినరోజు వేడుకలు
  • అతిథిగా హాజరైన హార్దిక్ పాండ్యా
  • కేక్ కట్ చేస్తుంటే చేతిలో సిగరెట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి పుట్టినరోజు వేడుకలు ముంబైలో అట్టహాసంగా జరుగుతున్న వేళ, వేడుకలకు హాజరైన హార్దిక్ పాండ్యా చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను సాక్షి, తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకోగా, సాక్షి కేక్ కట్ చేస్తున్న సమయంలో పాండ్యా సిగరెట్ తాగుతూ కనిపించడమే విమర్శలకు కారణమైంది.

భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటంతో ఈ కార్యక్రమానికి ధోనీ సహచరులు ఎవరూ రాలేదు. ఇక పాండ్యాను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. బర్త్ డే పార్టీలో కేక్ కట్ చేస్తుంటే సిగరెట్ తాగడమేంటని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం "పాండ్యా భాయ్‌... అది నిజంగా సిగరెటేనా?" అని ప్రశ్నిస్తున్నారు. మరి నిజం తెలియాలంటే పాండ్యా స్పందించాల్సిందే.
Mumbai
Pandya
MS Dhoni
Sakshi
Birthday

More Telugu News