Vijayasai Reddy: పక్కవాళ్ల ఆలోచనలను సిగ్గులేకుండా కాపీ కొట్టే చంద్రబాబు: విజయసాయిరెడ్డి ఎద్దేవా!
పక్కవాళ్ల ఆలోచనలను కాపీ కొట్టి, వాటిని తనవిగా చెప్పుకోవడంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "జిమ్మిక్కులలో సీఎం నాయుడుబాబుది గిన్నిస్ బుక్ స్థాయి. ఐడియాలు నిస్సిగ్గుగా కాపీకొట్టి అవి తన బుర్ర నుంచే పుట్టినవిగా చెప్పుకుంటూ పబ్లిక్ గా అమ్మేసుకుంటాడు. అవినీతితో ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు ఆయన చేసేది శూన్యం" అని మండిపడ్డారు. అంతకుముందు, "ప్రచారం దొరుకుతుందంటే చంద్రబాబు దేనికైనా సిద్థమే. ఇరవై లక్షల జనాభాకు మంచి నీరందించే ప్రకాశం బ్యారేజిలో శాశ్వత జల క్రీడల కేంద్రాలను ఏర్పాటు చేస్తాడట. ప్రపంచంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సోర్స్ ను జాగ్రత్తగా కాపాడుకుంటారు. బాబులాగా అపరిశుభ్రం చేయరు" అని అన్నారు.
జిమ్మిక్కులలో సీఎం నాయుడుబాబుది గిన్నిస్ బుక్ స్థాయి. ఐడియాలు నిస్సిగ్గుగా కాపీకొట్టి అవి తన బుర్ర నుంచే పుట్టినవిగా చెప్పుకుంటూ పబ్లిక్‌గా అమ్మేసుకుంటాడు. అవినీతితో ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు ఆయన చేసేది శూన్యం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 20, 2018
ప్రచారం దొరుకుతుందంటే చంద్రబాబు దేనికైనా సిద్థమే. ఇరవై లక్షల జనాభాకు మంచి నీరందించే ప్రకాశం బ్యారేజిలో శాశ్వత జల క్రీడల కేంద్రాలను ఏర్పాటు చేస్తాడట. ప్రపంచంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సోర్స్ ను జాగ్రత్తగా కాపాడుకుంటారు. బాబులాగా అపరిశుభ్రం చేయరు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2018