Vijayasai Reddy: పక్కవాళ్ల ఆలోచనలను సిగ్గులేకుండా కాపీ కొట్టే చంద్రబాబు: విజయసాయిరెడ్డి ఎద్దేవా!

  • జిమ్మిక్కులు చేయడంలో బాబుది గిన్నిస్ బుక్ స్థాయి
  • అవితీతితో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు
  • ఆయన చేసేది శూన్యమన్న విజయసాయి
పక్కవాళ్ల ఆలోచనలను కాపీ కొట్టి, వాటిని తనవిగా చెప్పుకోవడంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "జిమ్మిక్కులలో సీఎం నాయుడుబాబుది  గిన్నిస్ బుక్‌ స్థాయి. ఐడియాలు నిస్సిగ్గుగా కాపీకొట్టి అవి తన బుర్ర నుంచే పుట్టినవిగా చెప్పుకుంటూ  పబ్లిక్‌ గా అమ్మేసుకుంటాడు. అవినీతితో ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు ఆయన చేసేది శూన్యం" అని మండిపడ్డారు. అంతకుముందు, "ప్రచారం దొరుకుతుందంటే చంద్రబాబు దేనికైనా సిద్థమే. ఇరవై లక్షల జనాభాకు మంచి నీరందించే ప్రకాశం బ్యారేజిలో శాశ్వత జల క్రీడల కేంద్రాలను ఏర్పాటు చేస్తాడట. ప్రపంచంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సోర్స్ ను జాగ్రత్తగా కాపాడుకుంటారు. బాబులాగా అపరిశుభ్రం చేయరు" అని అన్నారు.






Vijayasai Reddy
Chandrababu
Twitter

More Telugu News