Nalgonda District: అదే జరిగితే గెలిచినా రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • నల్గొండ జిల్లాలో 10 స్థానాలూ తమవేనంటున్న టీఆర్ఎస్
  • అదే జరిగితే విజయం సాధించినా పదవిని వదిలేస్తా
  • ప్రచారంలో దూసుకెళుతున్న కోమటిరెడ్డి  
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ తాము విజయం సాధిస్తామని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తుండటంపై నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. 10 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని ప్రచారం చేసుకుంటున్నారని, అదే జరిగితే, తాను ఎమ్మెల్యేగా గెలిచినా, ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

కాగా, గత వారం రోజులుగా ప్రచారంలో దూసుకెళుతున్న ఆయన, జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో సైతం ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను, ముఖ్యంగా తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంపైనా ప్రత్యేక దృష్టిని సారించారు రాజగోపాల్ రెడ్డి.
Nalgonda District
Telangana
Komatireddy Venkatareddy
Congress
TRS

More Telugu News