Pawan Kalyan: రేపు చెన్నైలో పర్యటించనున్న పవన్.. కీలక ప్రకటన చేసే అవకాశం

  • రేపు చెన్నై వెళ్లనున్న పవన్
  • పార్టీ మద్దతుదారులతో సమావేశం
  • భవిష్యత్ ప్రణాళిక వెల్లడి
బుధవారం చెన్నై వెళ్లనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా పవన్ మీడియా సమావేశానికి ఒక రోజు ముందే సమాచారం అందించే జనసేన పార్టీ ఈసారి రెండు రోజుల ముందే సమాచారం ఇవ్వడం వెనక ఏదో కీలక విషయం దాగుందని అభిప్రాయపడుతున్నారు. బహుశా ముఖ్యమైన ప్రకటన చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈ నెల 21న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో అదే రోజు పవన్ ప్రకటన చేయనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏపీలో చురుగ్గా ఉన్న పవన్ ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన చెన్నై వెళ్తున్నట్టు సమాచారం. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

నిజానికి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించామని, అయితే, ఎన్నికలు ముందుగా జరుగుతుండడంతో బరిలోకి దిగడం కష్టమనే ఉద్దేశంతోనే తప్పుకున్నట్టు సోమవారం జనసేన ప్రకటించింది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిపింది.
Pawan Kalyan
Jana Sena
Chennai
Tamil Nadu
Karnataka

More Telugu News