Telangana: కార్తీక సోమవారం, ఏకాదశి.. దివ్యమైన ముహూర్తం.. నామినేషన్లతో జాతరను తలపించిన తెలంగాణ

  • నామినేషన్లతో కోలాహలంగా మారిన తెలంగాణ
  • బలప్రదర్శనకు వేదికగా మార్చుకున్న అభ్యర్థులు
  • రికార్డు స్థాయిలో నామినేషన్ల దాఖలు
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం జాతరను తలపించింది. కార్తీక సోమవారం, ఏకాదశి.. దివ్యమైన ముహూర్తం కావడంతో ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు పోటీపడ్డారు. మందీమార్బలంతో వచ్చి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో కోలాహలం నెలకొంది.

మొత్తం దాఖలైన నామినేషన్లలో మూడో వంతు ఒక్క సోమవారమే రావడాన్ని చూస్తే ముహూర్త బలానికి అభ్యర్థులు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కొందరు ఇదే అదునుగా కార్యకర్తలు, అభిమానులతో బలప్రదర్శన చేశారు. మొత్తం 3,584 నామినేషన్లు దాఖలు కాగా, ఒక్క సోమవారమే రికార్డు స్థాయిలో 2,087 నామినేషన్లు దాఖలు కావడం విశేషం.
Telangana
Nominations
Monday
Elections

More Telugu News