Chandrababu: చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మమత.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్న సీఎంలు

  • కోల్ కతాలో భేటీ అయిన చంద్రబాబు, మమతా బెనర్జీ
  • బాబు వెంట అశోక్, సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు
  • కూటమి ఏర్పాటులో భాగంగా పలువురు నేతలతో భేటీ అవుతున్న చంద్రబాబు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కోల్ కతా చేరుకున్న ఆయనకు మమతాబెనర్జీ ఘన స్వాగతం పలికారు. అనంతరం భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఇరువురు చర్చించారు. త్వరలోనే ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మహాకూటమి ఏర్పాటులో భాగంగా ఇప్పటికే చంద్రబాబు పలువురు నేతలను కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి హాజరైనవారిలో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు కూడా ఉన్నారు. 
Chandrababu
mamata banerjee
kolkata

More Telugu News