nayini narsimhareddy: తన చేతులతోనే ముఠా గోపాల్‌కు బీ ఫారం అందించిన నాయిని నరసింహారెడ్డి

  • ముషీరాబాద్‌ తెరాస టికెట్‌పై తొలగిన ఉత్కంఠ
  • గోపాల్‌ వైపే కేసీఆర్‌ మొగ్గు
  • నాయినికి నచ్చచెప్పి ఒప్పించిన టీఆర్‌ఎస్‌ అధినేత
తనకు కాకపోయినా తన అల్లుడికైనా టికెట్‌ ఇవ్వాలని కోరి, చివరి రోజు వరకు ఎదురు చూసిన తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రయత్నాలు ఫలించ లేదు. గెలుపు గుర్రాలకే టికెట్లని ప్రకటించిన కేసీఆర్‌ ముఠా గోపాల్‌వైపే మొగ్గు చూపడంతో నాయిని ఆశ అడియాశ అయింది.

పార్టీ అధినేత నిర్ణయంతో చేసేదేమీ లేక తన చేతులతోనే ముఠా గోపాల్‌కు పార్టీ బీ ఫారం అందించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ముషీరాబాద్‌ తెరాస అభ్యర్థి ఎంపిక సుఖాంతమైనట్టయింది. కోదాడకు బొల్లం మల్లయ్య యాదవ్‌ పేరు ఖరారు చేయడంతో మొత్తం 119 స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారైనట్లయింది. టికెట్‌ విషయంలో పట్టుబట్టిన నాయిని నరసింహారెడ్డిని స్వయంగా పిలిపించుకుని కేసీఆర్‌ నచ్చజెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు.
nayini narsimhareddy
mushirabad
b form

More Telugu News