Tollywood: కమేడియన్ వేణుమాధవ్ నామినేషన్ స్వీకరణ!

  • మూడు రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేయడంలో విఫలం
  • నేడు నిర్దేశించిన విధంగా పత్రాలతో వచ్చిన వేణుమాధవ్
  • నామినేషన్ ను పరిశీలనకు తీసుకున్న అధికారులు
మూడు రోజుల క్రితం కోదాడ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలన్న ఉద్దేశంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయిన కమేడియన్ వేణుమాధవ్, నేడు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు.

తన మద్దతుదారులతో కలసి వచ్చిన ఆయన, తన స్వస్థలం ఇదే కావడంతో, ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు మీడియాకు తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం తగిన పత్రాలు లేవంటూ అధికారులు వేణుమాధవ్ నామినేషన్ ను తీసుకోలేదన్న సంగతి తెలిసిందే. నేడు ఈసీ నిర్దేశించిన విధంగా ఆయన నామినేషన్ పత్రాలను తయారు చేయించి తీసుకురావడంతో, వాటిని పరిశీలనకు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Tollywood
Telangana
Venu Madhav
Nomination
Kodad
Independent

More Telugu News