sai pallavi: యాక్షన్ సన్నివేశాల్లో సాయిపల్లవి!

  • మలయాళ చిత్రంలో సాయిపల్లవి
  • థ్రిల్లర్ జోనర్లో సాగే కథాకథనాలు 
  • కథానాయకుడిగా ఫహాద్ ఫాజిల్ 
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ వుంది. తెలుగులో చేసిన 'ఫిదా'.. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రాలు సాయిపల్లవికి సహజనటి అనే పేరు తీసుకొచ్చాయి. ఆమె తాజా చిత్రంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు 'పడి పడిలేచె మనసు' రానుంది. ఇక మరో వైపున మలయాళంలోను ఫహాద్ ఫాజిల్ జోడీగా సాయిపల్లవి ఒక సినిమా చేస్తోంది.

వివేక్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవికి యాక్షన్ సీన్స్ కూడా వున్నాయట. ఇప్పటివరకూ ప్రేమకథా చిత్రాల్లో ఆమె ఆడుతూపాడుతూ వచ్చింది. బలమైన సన్నివేశాల్లో మనసును బరువెక్కించింది. అలాంటి సాయిపల్లవి మొదటిసారిగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో కనిపించనుందని సమాచారం. యాక్షన్ సీన్స్ లో ఈ సుకుమారి ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.   
sai pallavi

More Telugu News