Jagan: పోరాటయోధుడనని చెప్పుకునే జగన్ చిన్న కత్తి తగలగానే 10 రోజులు పడుకున్నారు!: పయ్యావుల కేశవ్

  • చంద్రబాబు దాడి చేయించారనడం హాస్యాస్పదం
  • అలాంటి సంస్కృతి టీడీపీకి ఎన్నడూ లేదు
  • జగన్ హత్యాయత్నం కేసులో సీరియస్ గా ఉన్నాం
తనపై హత్యాయత్నం ఘటనలో సీఎం చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ అధినేత జగన్ చెప్పడాన్ని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో జగన్ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కోడికత్తి ఘటనలో త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. హత్యలు, దాడులు చేయించే సంస్కృతి టీడీపీకి లేదని స్పష్టం చేశారు. అనంతపురంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు.

పోరాటయోధుడినని చెప్పుకునే జగన్ చిన్న కత్తిదాడికే 10 రోజులు విశ్రాంతి పేరుతో పడుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కు సానుభూతి, ప్రచారం రావాలనే ఉద్దేశంతోనే దాడిచేసినట్లు నిందితుడు శ్రీనివాసరావు స్వయంగా అంగీకరించాడని గుర్తుచేశారు. ఈ కోడికత్తి డ్రామాను ఏపీ ప్రజలు సైతం కోడి పందెంలాగే సరదాగా తీసుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్ పై జరిగిన దాడిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా దోషులను శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.
Jagan
YSRCP
Andhra Pradesh
Payyavula Keshav
Telugudesam
Anantapur District
criticisse

More Telugu News