charan: చరణ్ కోసం రంగంలోకి దిగిన ముంబై హెయిర్ స్టైలిష్ట్

  • రాజమౌళి మల్టీ స్టారర్ మొదలు 
  • డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ .. చరణ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి        
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. చరణ్ కోసం ముంబైకి చెందిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ను రంగంలోకి దింపారు. చరణ్ పాత్రకి సంబంధించిన స్టైలింగ్ అంతా కూడా ఆయన పర్యవేక్షణలో జరగనుంది.

15 సంవత్సరాల క్రితం నేను .. రాజమౌళి 'సై' సినిమా సమయంలో కలుసుకున్నాము. మళ్లీ ఇంతకాలానికి ఆయనతో కలిసి పనిచేస్తున్నాను' అని అలీమ్ హకీమ్ ట్వీట్ చేశాడు. ఆయనతోను .. రాజమౌళితోను తీసుకున్న సెల్ఫీని చరణ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొంతసేపటి క్రితం మొదలైంది. ఎప్పటి విషయాలు అప్పుడు తెలుసుకోవడానికి అభిమానులంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. కథానాయికలు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.
charan
ntr

More Telugu News