Bhadradri Kothagudem District: సైకిలెక్కనున్న భద్రాద్రి టీఆర్‌ఎస్‌ నేత కిలారి నాగేశ్వరరావు.. 21న ముహూర్తం

  • టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన నాగేశ్వరరావు
  • 2016లో అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లోకి జంప్‌
  • నామా సమక్షంలో తిరిగి సొంత పార్టీలో చేరేందుకు నిర్ణయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, పాల్వంచ మున్సిపాలిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ కిలారు నాగేశ్వరరావు మాతృ పార్టీ టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21వ తేదీన సైకిలెక్కేందుకు ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధికి కిలారు కృషి చేశారు. పలు కీలక పదవులు అలంకరించారు. అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో  కిలారు నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పుకున్నారు.

కానీ ఆ పార్టీలో ఇమడలేక, కొనసాగలేక ఇన్నాళ్లు నెట్టుకు వచ్చారని ఆయన అనుచరుల మాట. తెలంగాణలో మహాకూటమి ఏర్పడడం, సీట్ల సర్దుబాటులో భాగంగా ఖమ్మం నుంచి టీడీపీ నేత నామా నాగేశ్వరరావు పోటీ చేస్తుండడంతో ఆయన సమక్షంలో తిరిగి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో మహా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు.
Bhadradri Kothagudem District
kilaru nageswararao
TRS to Telugudesam

More Telugu News