Rohit Sharma: రోహిత్ శర్మను ఆపడం ఆస్ట్రేలియా తరం కాదు.. ఆసీస్ స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్

  • టీమిండియా ‘హిట్‌మ్యాన్’పై ప్రశంసలు
  • అతడు ఆడుతుంటే చూడడాన్ని ఎంజాయ్ చేస్తానన్న ఆసీస్ ఆల్ రౌండర్
  • ప్రశాంతతే అతడి బలమన్న మాక్స్‌వెల్
టీమిండియా ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మపై ఆసీస్ స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. సిరీస్‌లో భాగంగా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. ఈ నెల 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాక్స్‌వెల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘రోహిత్ శర్మను మీరు ఆపలేరు’’ అంటూ మాక్స్‌వెల్ వ్యాఖ్యానించి అతడి సత్తా ఏంటో చెప్పకనే చెప్పాడు.

పేస్, స్పిన్ బౌలింగ్ ఏదైనా అతడు అనుకుంటే బంతులను మైళ్ల దూరం పంపిస్తాడని పేర్కొన్నాడు. ‘‘రోహిత్ గొప్ప ఆటగాడు. అతడు చాలా సులభంగా ఆడతాడు. రోహిత్ ఆడుతుండగా చూడడాన్ని నేను ఎంజాయ్ చేస్తా’’ అని మాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు. రోహిత్ మానసికంగా కూడా చాలా బలవంతుడని, ప్రశాంతంగా, నిగ్రహంగా ఉంటాడని కొనియాడాడు. అతడిపై ఎవరైనా స్లెడ్జింగ్‌కు దిగినా పట్టించుకోడని, ఆవేశానికి గురికాడని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌కు దిగేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడని పేర్కొన్నాడు. నిజానికి బ్యాటింగ్‌లో అదే అతడి బలమని మాక్స్‌వెల్ ప్రశంసించాడు.
Rohit Sharma
Team India
Australia
Glenn Maxwell

More Telugu News