vijay devarakonda: 'టాక్సీవాలా' తొలిరోజు వసూళ్లు

  • థియేటర్స్ కి వచ్చిన 'టాక్సీవాలా'
  • ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల గ్రాస్ 
  • తెలుగు రాష్ట్రాల్లో 3.06 కోట్ల షేర్
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'టాక్సీవాలా' ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక జవల్కర్ .. మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తొలి రోజున మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 10.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 3.06 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఒక సాధారణ యువకుడిగా .. ఆత్మ ప్రవేశించిన టాక్సీకి డ్రైవర్ గా విజయ్ దేవరకొండ చాలా చక్కగా నటించాడనే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా విజయ్ దేవరకొండ తన నటనతోనే ముందుకు తీసుకెళ్లాడని అంటున్నారు. ప్రియాంక జవల్కర్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు. ఆదివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి ఉంటుందని అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రెడ్' పైనే పూర్తి దృష్టి పెట్టనున్నాడు.   
vijay devarakonda
priyanka

More Telugu News