Station Ghanpur: పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు, పక్కపక్కనే ఇళ్లు... తడికలను అడ్డం పెట్టిన పోలీసులు!

  • స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య
  • మహాకూటమి తరఫున బరిలోకి దిగిన ఇందిర
  • ఆసక్తికరంగా మారిన పోరు
అది తెలంగాణలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున తాటికొండ రాజయ్య బరిలో ఉండగా, మహాకూటమి తరఫున, కాంగ్రెస్ అభ్యర్థినిగా ఇందిర పోటీ పడుతున్నారు. వీరిద్దరూ వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. ఇద్దరి ఇళ్లూ ఒకే వీధిలో పక్కపక్కనే ఉన్నాయి. ఇద్దరూ తమ పార్టీ కార్యాలయాలుగా ఇంటినే మార్చేసుకున్నారు.

ఇంకేముంది, అనుక్షణం అక్కడ సందడే సందడి. విమర్శలు, ప్రతి విమర్శలూ కామన్. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా, రెండు ఇళ్ల మధ్యా తడికలను ఏర్పాటు చేశారు. ఒక పార్టీ కార్యకర్తలు, మరో పార్టీ కార్యకర్తలకు కనిపించకుండా చూసేందుకే ఈ ఏర్పాటు చేశామని అంటున్నారు. ఏది ఏమైనా ఈ దఫా ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ల మధ్య పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Station Ghanpur
Tatikonda Rajaiah
Indira

More Telugu News