చిన్నప్పటి నుంచి పెంచిన మావటిని తొండంతో చుట్టి నేలకేసి కొట్టిన ఏనుగు!
- జార్ఖండ్ జూలో విషాదం
- మేతపెడుతున్న సమయంలో ఘటన
- మరో ఇద్దరు సిబ్బందిని పరుగులు పెట్టించిన ఏనుగు
అయితే, ఏనుగుపై కూర్చున్న మావటి మహేంద్రసింగ్ను తొండంతో కిందికి లాగి పడేసింది. అనంతరం అతడిని తొండంతో చుట్టి నేలకేసి కొట్టింది. తీవ్రంగా గాయపడిన మహేంద్రసింగ్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తనను కొట్టిచంపిన రాము(ఏనుగు)ను మహేంద్రసింగ్ చిన్నప్పటి నుంచి పెంచుతుండడం గమనార్హం.