ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా యోగి ఉన్నారు.. రాముడు మాత్రం టెంటులో ఉన్నాడు: సొంతపార్టీపై బీజేపీ నేత విమర్శలు
- పీఎం, సీఎం తీరు దేశానికి మచ్చ తెచ్చేలా ఉంది
- ఆలస్యం చేస్తే రాముడికి కోపం వస్తుంది
- వెంటనే పునాది రాయి వేయండి
హిందువుల మనోభావాలు దెబ్బతినక ముందే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే బీజేపీకి పెను నష్టం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో జాప్యానికి చోటివ్వకుండా వెంటనే మందిర నిర్మాణానికి పునాది రాయి వేయాలని కోరారు. ఇంకా ఆలస్యం చేస్తే రాముడికి కోపం వస్తుందని పేర్కొన్నారు. కాగా, ఇటీవల యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ మాట్లాడుతూ రాముడు తనకు ఆలయం కావాలని ఎప్పుడు కోరుకుంటే అప్పుడే నిర్మిస్తామని చెప్పడం గమనార్హం.