amaravathi: చంద్రబాబును కలిసిన టీ-టీడీపీ నేత రొక్కం భీమ్ రెడ్డి

  • అమరావతిలో చంద్రబాబుతో రొక్కం భేటీ
  • ముప్పై ఏడేళ్లుగా పార్టీని నమ్ముకున్నానన్న రొక్కం
  • ఇబ్రహీంపట్నం స్థానం కేటాయించమని కోరిన వైనం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని టీ-టీడీపీ నేత రొక్కం భీమ్ రెడ్డి కలిశారు. అమరావతిలో చంద్రబాబుతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. ఇబ్రహీంపట్నం టీడీపీ స్థానాన్ని తనకు కేటాయించాలని, ముప్పై ఏడేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్నానని చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే టీడీపీ కార్యకర్తలతో, తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పినట్టు సమాచారం. కాగా, ఇబ్రహీంపట్నం టీడీపీ స్థానాన్ని సామ రంగారెడ్డికి ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే.
amaravathi
Chandrababu
t-Telugudesam
rokkam bheem reddy

More Telugu News