Chandrababu: సీఎం చంద్రబాబుపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశా: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • ఛానెల్స్ లో ఏపీ ప్రకటనలను నిలువరించాలని కోరాం
  • పార్టీ పరంగా ప్రకటనలు ఇచ్చుకుంటే అభ్యంతరం లేదు
  • టీ-బీజేపీపైనా ఈసీకి ఫిర్యాదు చేశాం

ఏపీ ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబుపైనా తెలంగాణ ఎన్నికల కమిషన్ అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాష్ కు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తున్న కారణంగా టీవీ ఛానెల్స్ లో ఏపీ ప్రభుత్వ ప్రకటనలను నిలువరించాలని కోరామని చెప్పారు.

ఈ విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. పార్టీ పరంగా ప్రకటనలు ఇచ్చుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన వినోద్, ప్రభుత్వపరంగా ఇస్తున్న ప్రకటనలను మాత్రమే నిలిపివేయాలని కోరినట్టు చెప్పారు. టీ-బీజేపీపైనా ఈసీకి ఫిర్యాదు చేశామని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, మతసామరస్యం దెబ్బతినేలా కార్టూన్లు వేసి సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

కొన్ని పాటలు కేసీఆర్ స్వయంగా రాశారు

ఎన్నికల ప్రచారం నిమిత్తం టీఆర్ఎస్ కు సంబంధించి  ఆరు పాటలు రాయించామని వినోద్ చెప్పారు. ఈసీ అనుమతి నిమిత్తం పాటల సీడీని అందజేశామని, ఆ పాటలు విన్న తర్వాత వాటి విడుదలకు అనుమతి ఇస్తామని ఈసీ అధికారులు పేర్కొన్నట్టు చెప్పారు.  

More Telugu News