election commission: ఎన్నికల ఖర్చుపై ఈసీ కట్టడి... రూ.10 వేలు దాటితే అకౌంట్‌ పే తప్పనిసరి

  • చెక్కు లేదా డీడీ రూపంలోనే చెల్లించాలని ఎన్నికల అధికారి దానకిశోర్‌ స్పష్టీకరణ
  • గత ఎన్నికల్లో రూ.20 వేల వరకు నగదు బదలాయింపునకు అవకాశం
  • అభ్యర్థులు తమ పేరున ప్రత్యేకంగా అకౌంట్‌ తెరవాలని ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయాలపై ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు మొదలు పెట్టింది. పది వేలకు మించి చేసే ప్రతి ఖర్చు అకౌంట్‌ పే‌గా జరగాలని ఆదేశించింది. ఎన్నికల అధికారి దానకిశోర్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రూ.20 వేల వరకు నగదు రూపంలో చెల్లించే అవకాశం ఉండేది.

దీన్ని సగానికి తగ్గించింది. అభ్యర్థులు తప్పనిసరిగా తమ పేరున బ్యాంక్‌ అకౌంట్‌ తెరవాలని, ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వ్యయాలన్నీ ఆ అకౌంట్‌ నుంచే జరగాలని సూచించారు. వ్యక్తులు, సంస్థలకు పది వేలకు మించి చెల్లించాల్సి వస్తే చెక్‌, ఆర్టీజీఎస్‌ బదలాయింపు, డీడీ రూపంలో ఇవ్వాలని కోరింది. ప్రచారానికి సంబంధించిన వ్యయాలకు ప్రత్యేక రిజిస్టర్‌ నిర్వహించాలని కోరింది.
election commission
expendature

More Telugu News