Congress: ఇక మిగిలిన స్థానాల్లో ఎవరో?... నేటి సాయంత్రం కాంగ్రెస్‌ తుది జాబితా!

  • మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది
  • కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆమోదం కోసం ఎదురు చూపు
  • ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఆశావహులు
కాంగ్రెస్‌ టికెట్ల కేటాయింపు వ్యవహారం చివరి అంకానికి చేరింది. మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిర్యాలగూడ, నారాయణ్‌పేట, నారాయణఖేడ్‌, కోరుట్ల, హుజూరాబాద్‌, దేవరకద్ర స్థానాలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయిందని, పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ ఆమోదం తెలపడమే తరువాయి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

 కాగా, ఆశావహులు తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. చివరి నిమిషంలోనైనా అదృష్టం తలుపు తడుతుందన్న ఆశతో తమ మార్గాల్లో తాము వెళుతున్నారు. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న మిగిలిన ఆరు స్థానాల్లో రెండు మూడు స్థానాల్లో టీజేఎస్‌, టీడీపీ మధ్య అవగాహన కుదరాల్సి ఉందని ఆ పార్టీల వారు చెబుతున్నారు.


Congress
final list

More Telugu News