Jagan: దాడి ఘటన నాటి షర్టును అందజేయాలంటూ జగన్ కు కోర్టు ఆదేశాలు!

  • గత నెల 25న జగన్ పై దాడి
  • రక్తపు మరకలంటిన చొక్కా
  • దాన్ని తెచ్చివ్వాలని కోర్టు ఆదేశం
గత నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి జరిగిన వేళ, ఆయన ధరించిన షర్టును తమకు సమర్పించాలని విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు జగన్ ను ఆదేశించింది. హత్యాయత్నం నాడు జగన్ కు కత్తి గాయం కావడంతో ఆయన ధరించిన చొక్కాకు రక్తం మరకలు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ చొక్కా కీలకం కాబట్టి దీనిని కోర్టుకు అందజేయాల్సిందిగా న్యాయస్థానం జగన్ ను ఆదేశించింది.  
Jagan
Vizag
airport
shirt
Murder Attempt
Court
SIT

More Telugu News