l ramana: మహాకూటమి ఏర్పాటుకు కారణం ఇదే: ఎల్. రమణ

  • ఫామ్ హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్
  • బీజేపీతో కేసీఆర్ కు లోపాయికారీ ఒప్పందం ఉంది
  • తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వమే మహాకూటమి ఏర్పాటుకు కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. బీజేపీతో కేసీఆర్ కు లోపాయికారీ ఒప్పందం ఉందని చెప్పారు. కమిషన్లకు కక్కుర్తి పడే ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టారని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు టీడీపీ పెద్ద పీట వేసిందని చెప్పారు. మహాకూటమిలో మహిళలకు ప్రాధాన్యతను ఇస్తామని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే... తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. 
l ramana
kcr
mahakutami

More Telugu News