jagan: తనపై దాడి తర్వాత తొలిసారి ప్రసంగించనున్న జగన్
- పార్వతీపురంలో నేడు బహిరంగసభ
- దాడిపై ఇంతవరకు స్పందించని జగన్
- సభలో ఏం చెబుతారనే విషయంపై సర్వత్ర ఆసక్తి
విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన తర్వాత... వైసీపీ అధినేత జగన్ ఈరోజు తొలిసారి బహిరంగసభలో ప్రసంగించనున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని సూరంపేట క్రాస్ శివారు నుంచి జగన్ పాదయాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది.
నర్సిపురం, వసుంధర నగర్, యర్రాకృష్ణ కాలనీ మీదుగా పాదయాత్ర పార్వతీపురం చేరుకుంటుంది. పాత బస్టాండ్ జంక్షన్ లో సాయంత్రం బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు. తనపై దాడి జరిగిన తర్వాత జగన్ ఇంతవరకు ఆ అంశంపై బహిరంగంగా స్పందించలేదు. తాను క్షేమంగా ఉన్నానని మాత్రమే ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఈ నేపథ్యంలో, ఈనాటి బహిరంగసభలో జగన్ ఏం చెబుతారనే విషయమై సర్వత్ర ఆసక్తి నెలకొంది.