charan: చరణ్ తో రకుల్ ఐటమ్ సాంగ్?

  • ముగింపు దశలో చరణ్ మూవీ 
  • ఐటమ్ సాంగ్ కి సన్నాహాలు 
  • బోయపాటి మూవీల్లో వరుసగా రకుల్ 
బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' నిర్మితమవుతోంది. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీకి ఇంకా చాలా సమయం ఉండటంతో ఒక ఐటమ్ సాంగ్ చేద్దామని బోయపాటి భావించినట్టుగా సమాచారం.

 హీరో హీరోయిన్ల మధ్య ఒక మాస్ మసాలా సాంగ్ ఉండటంతో, దాంతో సరిపెట్టేద్దామనుకున్న బోయపాటి మనసు మార్చుకున్నాడట. అదిరిపోయే రేంజ్ లో ఒక ఐటమ్ సాంగ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చిన ఆయన, రకుల్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా 'సరైనోడు'లోను .. ఆ తరువాత 'జయ జానకి నాయక'లోను రకుల్ కి బోయపాటి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు 'వినయ విధేయ రామ' లోను ఆమె మెరిసేలా చూస్తున్నాడు. ఈ ఛాన్స్ ను రకుల్ అంగీకరించవచ్చనే చెప్పుకుంటున్నారు.   
charan
rakul

More Telugu News