Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా.. కాంగ్రెస్ అభ్యర్థులకూ ప్రచారం చేస్తా!: నందమూరి బాలకృష్ణ

  • 26 నుంచి ప్రచారంలోకి దిగుతా
  • రోడ్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు
  • బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరు
మహాకూటమి(ప్రజాకూటమి) తరఫున తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగుతానని ప్రకటించారు. ఈ రోజు నందమూరి సుహాసిని సహా పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు.

మహాకూటమిలోని కాంగ్రెస్ నేతల తరఫున కూడా ప్రచారం నిర్వహిస్తానని బాలకృష్ణ తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇంకా రూట్ మ్యాప్ తయారుకాలేదని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు బాలకృష్ణ చెప్పారు. నందమూరి హరికృష్ణతో ఉన్న స్నేహం, అభిమానంతోనే ఆయన స్మారకానికి కేసీఆర్ స్థలం కేటాయించారని బాలయ్య వ్యాఖ్యానించారు. 
Telangana
Andhra Pradesh
nandamuri balakrishana
suhasini
kukatpalli

More Telugu News