nandamuri suhasini: నందమూరి సుహాసినికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు

  • సుహాసినిని కలిసిన ఎల్.రమణ, రావుల
  • సుహాసినిని అందరూ ఆశీర్వదించి.. గెలిపించాలి
  • విజయం కోసం సమష్టిగా పాటుపడతామన్ననేతలు 
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న నందమూరి సుహాసినికి టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లోని నందమూరి హరికృష్ణ నివాసంలో ఆమెను కలిశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, సుహాసినిని అందరూ ఆశీర్వదించి.. గెలిపించాలని కోరారు. సుహాసిని విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పాటుపడతారని చెప్పారు.

పెద్దిరెడ్డి, మందడి లకు ఫోన్ చేసిన సుహాసిని 


కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగనున్న సుహాసిని, పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ సీనియర్ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, మందడి శ్రీనివాసరావుకి ఆమె ఫోన్ కాల్స్ చేసి మాట్లాడారు. సుహాసిని గెలుపునకు పూర్తి సహకారం అందిస్తామని ఇద్దరు నేతలు చెప్పినట్టు సమాచారం.
nandamuri suhasini
kukatpalli
Telugudesam
L.ramana
ravula

More Telugu News