hai land: హాయ్ ల్యాండ్ ఆస్తి తమది కాదన్న ‘అగ్రిగోల్డ్’

  • హైకోర్టులో ఈ కేసు విచారణ
  • హాయ్ ల్యాండ్ తో తమకు సంబంధం లేదన్న అగ్రిగోల్డ్
  • అఫిడవిట్ ధాఖలు చేయాలని ఆదేశాలు
అగ్రిగోల్డ్ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. హాయ్ ల్యాండ్ ఆస్తి తమది కాదంటూ అగ్రిగోల్డ్ సంస్థ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ఈరోజు హైకోర్టులో జరిగింది. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదని అగ్రిగోల్డ్ సంస్థపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్ ల్యాండ్ తమది కాదని అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ సంస్థను హైకోర్టు ఆదేశించింది. కాగా, ‘అగ్రిగోల్డ్’కు, తమకు ఎటువంటి సంబంధం లేదని హాయ్ ల్యాండ్ కూడా కోర్టుకు తెలిపింది. హాయ్ ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావుపై విచారణ జరపాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
  
hai land
agri gold
High Court

More Telugu News