Nandamuri Suhasini: ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ల విషయాన్ని నామినేషన్ అనంతరం చెబుతా!: సుహాసిని

  • అందరి ఆమోదంతోనే ఎన్నికల బరిలోకి దిగుతున్నా
  • రాజకీయాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది
  • హరికృష్ణ కుమార్తెను ఆశీర్వదించండి
కుటుంబ సభ్యులందరి ఆమోదంతోనే తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నానని దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని తెలిపారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉందన్నారు. తాను రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సుహాసిని వెల్లడించారు.

ప్రముఖ సినీనటులు, సుహాసిని సోదరులైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్నికల ప్రచారానికి వస్తారా? అని మీడియా ప్రశ్నించగా ఈ విషయాలన్నింటిపై రేపు నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడుతానని సుహాసిని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం చంద్రబాబు కష్ట పడుతున్నారని.. హరికృష్ణ కుమార్తెను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
Nandamuri Suhasini
Kalyan Ram
Junior NTR
Ramakrishna
Chandrababu
Harikrishna

More Telugu News