chiranjeevi: కొరటాల తరువాత ఛాన్స్ బోయపాటికి ఇచ్చిన చిరూ?

  • 'సైరా'తో బిజీగా చిరంజీవి 
  • తదుపరి సినిమా కొరటాలతో
  • ఆ తరువాత ప్రాజెక్టు సెట్ అయినట్టే   
ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతూనే వున్నాయి. కొరటాల తరువాత సినిమాను బోయపాటి శ్రీనుతో చేసే అవకాశం వుందన్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

 చిరంజీవి కోసం ఒక విభిన్నమైన కథను రెడీ చేయమని బోయపాటితో చరణ్ చెప్పాడట. 'వినయ విధేయ రామ' విడుదల తరువాత బోయపాటి అందుకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పుకుంటున్నారు. 'సరైనోడు' సినిమా సమయంలోనే బోయపాటి దర్శక ప్రత్రిభను చిరంజీవి ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్లో సినిమా చరణ్ బ్యానర్ పై రూపొందుతుందో .. గీతా ఆర్ట్స్ పై నిర్మితమవుతుందో చూడాలి. 
chiranjeevi
charan
boyapati

More Telugu News